అమరావతి విషయంలో ఇకనైనా మేల్కోవాలి

పంతాలకు పోతే నష్టపోయేది ఎపి ప్రజలే
రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
పలు పార్టీల నేతల అభిప్రాయం
అమరావతి,ఫిబ్రవరి26(జనం సాక్షి): అమరాతి విషయంలో సిఎం జగన్‌ తప్పటడుగులు వేశారని దానిని సరిదిద్దుకోవాలని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఇంకా దీనిని కొనసాగించడం వల్ల లాభం లేదన్న విషయం గత మూడేళ్లుగా అయినా సిఎం జగన్‌కు అర్థం అయివుండాలని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులతో ప్రజలను గందరగోళంలోకి నెట్టేశారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా ఈ రెండేళ్లలో అయినా రాజధాని అమరావతి నిర్మాణానికి దోహదపడాలని సిపిఐ
నాయకుడు నారాయణ అన్నారు. ఈ వవిషయాన్ని తేలికగా తీసుకోవద్దన్నారు. రాజధాని లేని రాజ్యం లాగా ఆంధ్రపద్రేవ్‌ కొనసాగడం ఎంతమాత్రం సరికాదన్నారు. గత ప్రభుత్వంపై కక్షతో ఇలాంటి కీలక విషయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజల భవిష్యత్‌ను అంధకారంలో పడేశాయని అన్నారు. అమరావతి కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. అమరావతి రాజధాని కోసం కేంద్రంతో పోరాడాలని కాంగ్రెస్‌ నేతలు సాకే శైలజానాథ్‌, తులసిరెడ్డిలు కూడా డిమాండ్‌ చేశారు. అమరావతిని పక్కన పెట్టడంతో ఎపికి పెట్టుబడులు వెనక్కి పోయాయని టిడిపి నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావులు అన్నారు. గత 800 రోజులుగా జరుగుతున్న ఆందోలనతో జై అమరావతి నినాదం హోరెత్తింది.. అమరావతే తమ అంతిమ లక్ష్యం అంటూ అక్కడి రైతులు, మహిళలు, కూలీలు ఉద్యమ పిడికిలి బిగించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. అడ్డంకులు కల్పించినా.. కేసులు పెట్టినా అడుగులు వెనకకు పడవంటూ తెగేసి చెప్పారు. ఉద్యమం మొదలై 800 రోజులు కావొస్తున్న సందర్భంగా రైతులు, మహిళలు 24గంటల సామూహిక నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని నినదించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్న రైతులు, మహిళలు అదే పట్టుదల కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమ లక్ష్యాన్ని గుర్తించి ప్రభుత్వం తోణం తన విధానాన్ని సవిూక్షించుకోవాలని ఆయా పార్టీల నేతలు సూచించారు. అమరావతి ఉద్యమం 800వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని గ్రామం వెలగపూడిలో శుక్రవారం రైతులు, రైతు కూలీలు, మహిళలు, దళిత జేఏసీ నేతలు 24గంటల దీక్ష చేపట్టారు. అమరావతి ప్రజాదీక్ష పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దుతు తెలిపాయి. అలానే ప్రజా, కులసంఘాలు తమ మద్దతు తెలియజేశాయి. తొలుత ఉద్యమంలో అశువులు బాసిన వారికి నివాళులు అర్పించారు. ప్రభుత్వం మూడురాజధానుల బిల్లుల్ని మళ్తీ తేస్తే.. తాడోపేడో తేల్చుకునేవరకూ విశ్రమించబోమని రైతులు తేల్చిచెప్పారు. అమరావతి సాధన ప్రతిజ్ఞ..పాలనా రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు తమ పోరు ఆపేది లేదని దళిత జేఏసీ నేతలు చెప్పారు. అంబేద్కర్‌ స్మృతివనం వద్ద వారు అమరావతి సాధన ప్రతిజ్ఞ చేశారు. దళిత కూలీల హక్కులు, అసైన్డ్‌ రైతులకు మెరుగైన ప్యాకేజీతో పాటు వారికి కౌలు ఇచ్చేవరకు రోజూ వినూత్న రీతిలో ప్రభుత్వానికి నిరసన సెగ తగేలేలా కార్యక్రమాలు చేపడతామని జేఏసీ నేతలు తెలిపారు. రైతులు, మహిళలు తలపెట్టిన దీక్షలకు అన్ని పార్టీలకు చెందిన మహిళా నేతలు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా పంతాలకు పోకుండా చూడాలన్నారు.