అమరుడు కామ్రేడ్ ఎల్లన్న ఆశయ సాధనకై ఉద్యమిద్దాం

అమరుడు కామ్రేడ్ ఎల్లన్న ఆశయ సాధనకై ఉద్యమిద్దాం: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బయ్యారం సబ్ డివిజన్ కార్యదర్శి ఎస్కే మదార్*
బయ్యారం, జూన్ 23(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో అమరుడు కామ్రేడ్ ఎల్లన్న చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బయ్యారం సబ్ డివిజన్ కార్యదర్శి  ఎస్కే మదార్ మాట్లాడుతూ..
ఉమ్మడి వరంగల్ జిల్లా, కొత్తగూడ మండలం, లడాయి గడ్డ వద్ద పోలీస్ ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు. కామ్రేడ్ ఎల్లన్న ప్రతిఘటన ఉద్యమ దళ నాయకుడు, రివిజనిజం కు, అతివాదం కు, వ్యతిరేకంగా పోరాటం చేశారు. పెట్టుబడిదారి భూస్వామ్య వ్యవస్థను కూల్చడానికి ప్రతిఘటన పోరాటమే సరైన మార్గమని నమ్మి ప్రతిఘటన పోరాటాన్ని నడపడమే కాదు తనే ముందుండి గల నాయకుడిగా ఎదిగారు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. ఆదివాసి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం దాడులను వ్యతిరేకంగా పోరాటం చేశారు. అధిక వడ్డీ వ్యాపారస్తుల దోపిడీ నడ్డి విరిచి గిరిజన ప్రాంతంలో పేదోళ్లకు పోడు భూమి కొట్టించి అందరికీ సమానంగా భూమిని పంచి భూమి సమస్యలను తీర్చారు. పార్టీ అవసరం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, వివిధ ప్రాంతంలో పనిచేసి పార్టీని విస్తరణ చేశారు. రాజకీయ అధీనంలో తుపాకీ ఉండాలని ఆచరణలో చూపిన ఆదర్శవాది రివిజనిజం, అతివాదం విప్లవ ఉద్యమం కి చాలా ప్రమాదమని బలంగా వాదించి ప్రతిఘటన పోరాటం భారతదేశం దీనికి సరైన మార్గం అని నమ్మారు. ఈ క్రమంలో పోలీస్ లకు టార్గెట్ గా ఈ సంవత్సరం జూన్ 23 తేదీ సాయంత్రం 6 గంటలకు దళం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం కు అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు ముందే ఆ ప్రాంతం ను, చుట్టుముట్టిన పోలీసులు కామ్రేడ్ ఎల్లన్న దళం మీద పోలీసులు కాల్పులు జరుపగా కామ్రేడ్ ఎల్లన్న తన దళం ను సహచరులను కాపాడి వారిని తప్పించి పోలీస్ దాడులని దీటుగా ఎదుర్కొంటున్న క్రమంలో పోలీసు తోటకి నేలకొరిగిన విప్లవ వీరుడు కామ్రేడ్ ఎల్లన్న ఆ మార్గంలో ప్రయాణం చేయడమే మనం ఎల్లం ఆకాశానికి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో  నాగేశ్వరరావు, రామగిరి బిక్షం, వీరభద్రం, సురేందర్, మురళి, ప్రభాకర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.