అమిత్‌షావి ఉత్తిమాటలు
– కేంద్ర నిధులు కేవలం 36వేల కోట్లు మాత్రమే
– మా వాటా బాజాప్తా తీసుకుంటాం
-బిక్షమెత్తుకోం
– ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్,జూన్ 11(జనంసాక్షి): మోదీ సర్కారు తెలంగాణకు చేసిందేవిూలేదని ధ్వజమెత్తారు. రాష్టాల్రు కేంద్ర ప్రభుత్వం వద్ద బిక్షమెత్తుకోవని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. రాష్టాల్రు వేలాది కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నాయని గుర్తు చేశారు. సూర్యాపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. సూర్యాపేట సభలో అమిత్‌షా అన్ని ప్రగల్భాలు పలికారని తెలిపారు. ఆయన లెక్కలు తప్పి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలేకరులతో మాట్లాడుతూ రాష్టాన్రికి రూ.90 వేల కోట్లు ఇచ్చామని కేంద్రం తప్పుడు లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. రెండు సంవత్సరాల్లో కేంద్రం రాష్టాన్రికి విదిల్చింది రూ.36 వేలకోట్లు మాత్రమేనని విమర్శించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రాష్టాన్రికి ఇచ్చింది కేవలం రూ.15 వేల 306 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అసలు రెండు సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆమోదం పొందిందా?అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. స్వయంగా ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ పాలనను మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఆదర్శమైనవని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని గుర్తు చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వాన్ని
పొగుడుతుంటే అమిత్‌షా విమర్శించడం బీజేపీ రెండు నాల్కల దోరణికి నిదర్శనమన్నారు. నిరుద్యోగులకు, పేదలకు ఏం ఒరగబెట్టారో అమిత్‌షా చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవ ప్రపంచంలోకి రావాలన్నారు. తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. పేదలకు వేయి రూపాలయ పెన్షన్, సన్నబియ్యం పంపిణీ,ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నామని అన్నారు. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు.




