అమిత్‌ షాపై అమెరికా ఆంక్షలు!

– పౌరసత్వ బిల్లుపై యూఎస్‌ కమిషన్‌ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై అమెరికాకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడమ్‌(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) కీలక వ్యాఖ్యలు చేసింది.
మతప్రాదికన తయారుచేసిన ఈ బిల్లు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. అలాగే రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందినట్లయితే ¬ంమంత్రి అమిత్‌ షా సహా, ఇతర కీలక నాయకత్వంపై ఆంక్షల్ని విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఈ బిల్లుని ‘తప్పుడు దిశలో వెళుతున్న ప్రమాదకరమైన మలుపు’గా అభివర్ణించింది. భారతదేశానికి ఉన్న ఘనమైన లౌకిక చరిత్రకు, రాజ్యాంగంలో కల్పించిన సమానత్వపు హక్కుకు ఇది వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. అసోంలో చేపట్టిన ఎన్‌ఆర్‌సీ పక్రియపైనా ఇటీవల యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ బిల్లు వల్ల దేశంలోని ఏ ఒక్క పౌరుడు తమ పౌరసత్వం కోల్పోరని లోక్‌సభలో చర్చ సందర్భంగా ¬ంమంత్రి అమిత్‌ షా భరోసా కల్పించిన విషయం తెలిసిందే. బిల్లుకు దేశంలోని 130కోట్ల మంది పౌరుల మద్దతు ఉందని ఉద్ఘాటించారు. ఈ బిల్లు ముస్లిం సోదరులకు ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఎట్టకేలకు సోమవారం బిల్లు సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదం పొందింది. మన అంతర్గత విషయాల్లో ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల నివేదికలు, అభిప్రాయాల్ని పరిగణించబోమని యూపీఏ హయాం నాటి నుంచే భారత్‌ స్పష్టం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మతస్వేచ్ఛపై సవిూక్ష కోసం వచ్చే యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ సభ్యులకు వీసా కూడా తిరస్కరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ సిఫార్సులు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఏవిూ ఉండదు.