అమృతహస్తం పథకాన్ని ప్రారంభించిన మంత్రి
ఖమ్మం : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అమృత హస్తం పథకాన్ని ప్రారంభించారు. ఇల్లెందు ఐసీడీఎన్ పరిధిలో కామేపల్లి మండలం కొత్తలింగాల్లో పథకాన్ని ప్రారంభించిన ఆయన చిన్నారులకు పండ్లు పంచి వారితో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం గర్భణులకు భోజనాలను స్వయంగా వడ్డించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.