అమెరికన్లకు వైద్యం అందని ద్రాక్షే

న్యూయార్క్‌:అత్యంత సంపన్న వంతమైన దేశమని ప్రపంచవాప్తంగా భ్రమలు కల్పిస్తున్న అమెరికాలో ప్రజలకు కనీసం సరైన వైద్యం కూడా అందని ద్రాక్షే నన్న కఠోర నిజం బయటపడింది. ఆ దేశ ప్రజల్లో చాలా మందికి ఖరీదైన వైద్యం చేయించుకునే ఆర్ధిక స్థోమత లేదని సిడిసి సర్వే తేల్చింది. వైద్యానికయ్యే ఖర్చులు భరించలేక రోగులు ఖరీదైన ఔషధాలకు బదులుగా చౌకగా దోరికే వాటిని ఉపయోగిస్తున్నారని బుధవారం విడుదల చేసిన సర్వేలో పేర్కోన్నారు. వైద్య బీమా లేక పోవటం, వైద్యం ఖరీదైన సేవగా మావటంతో ఈ పరిస్థితి వచ్చిందని సర్వే తెలిపింది. తక్కువ విలువైన ఔషధాలను సూచించాల్సిందిగా రోగులు వైద్యులను అడుగుతున్నారని సర్వే వెల్లడించింది.రోగులు సరైన ఔషధాలు వాడకపోవటంతో వ్యాధులు పెరిగి అత్యవసర వైద్యసేవలు అవసరమవుతున్నాయని సర్వే తేల్చింది.18-64 సంరత్సరాల వయస్సు వారిలో 19.7 శాతం మంది ఖరీదైన వైద్యం పోందలేక పోతున్నారని సర్వే వెల్లడించింది.