అమెరికాలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి శాన్వి దారుణ హత్య
హత్యోదంతాన్ని బయటపెట్టిన ఎఫ్.బీ.ఐ
ఆస్తి తగాదాలే కారణం ..
హంతకుడు సమీపబంధువు యండమూరి రఘు
పదినెలల పసి పాపను చూడగానే అనురాగంతో చేరదీసి ముద్దాడుతారు. అందులోను ఇంకా మన బంధువుల పిల్లలంటే మరింత ప్రేమతో వారిని కనుపాపల కాపాడుతారు. కాని ఆస్తికోసం ఆ పసి కన్నులనే శాశ్వాతంగా మూసివేశాడొక హంతకుడు. పది నెలల పసి పాపను ఆస్తి కోసం హతమార్చిన దుర్మార్గుడు.
పెన్విలేనియా, అక్టోబర్26: అమెరికా, అమెరికాలోని పెన్విలేనియా రాష్ట్రంలో నాలుగు రోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి శాన్వి ( 10 నెలలు) హత్యకు గురైంది. ఆస్తికోసం అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే ఆమె సమీప బంధువు యండమూరి రఘు ఆమెను హత్య చేశాడని ఎఫ్‌డీఐ అధికారులు వెల్లడించారు. స్థానికంగా ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్న రఘు పోలీసుల విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆస్తి తగాదాలే ఆమె హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆమె నాయనమ్మ సత్యవతిని హత్య చేసి శాన్విని దుండగులు కిడ్నాపు చేసిన వషయం తెలిసిందే. శాన్వి ఆచూకీ కోసం అమెరికాలోని తెలుగుసంఘాల వారు, పోలీసులు ముమ్మరంగా ప్రయత్నించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) శాన్వికి సంబంధించిన సమాచారమిచ్చినవారికి రూ.16 లక్షలు నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తులో స్థానిక పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ కూడా పంచుకుంది. చిన్నారి శాన్విని సమీప బంధువే హత్య చేయడంపై కుటుంబసభ్యులు, బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
అపార్ట్‌మెంట్‌లో పాప శవం
శాన్వి నాయనమ్మ సత్యవతిని హత్య చేసిన అనంతరం చిన్నారి శాన్విని రఘు అదే అపార్ట్‌మెంట్‌లోని సౌనాలో హత్య చేసినట్లు మాంట్‌గమారీ కౌంటీ అటార్నీ రిసాపెర్మన్ వెల్లడించారు. పాపను అపహరించి డబ్బు డిమాండ్ చేయాలనేది రఘు పథకమని వారు తెలిపారు.