అమెరికాలో కేటీఆర్‌ బిజీబిజీ

4
సిస్కో, జీఈ, సన్‌ మైక్రో సిస్టమ్స్‌లతో భేేటీ

శాన్‌ జోస్‌  మే16(జనంసాక్షి):

తన అమెరికా పర్యటనలో పర్యటిస్తున్న ఐటిశాఖ  మంత్రి కె.తారకరామారావు ప్రఖ్యాత నెట్‌ వర్కింగ్‌ కంపెనీ సిస్కో  సియివో , చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ తో భేటీ మంత్రి భేటీ అయ్యారు. కాలిఫోర్నియాలోని , శాన్‌ జోస్‌ నగరంలో సిస్కో కేంద్ర కార్యలయంలో మంత్రి, సంస్ద చైర్మన్‌ ని కలిసారు. తెలంగాణలోని పారిశ్రామిక అవకాశాలపై మంత్రి సియివొకి  సవివరంగా ఓక ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ముఖ్యంగా తెలంగాణ పారిశ్రామిక విధానంపైన మంత్రి తెలిపిన పలు అంశాలపై జాన్‌ చాంబర్స్‌ చాల అసక్తి కనబరిచారని, ఓక ప్రభుత్వం ఇంత పారదర్శకంగా పారిశ్రామిక విధానాన్ని, పరిపాలనా సౌలభ్యాన్ని అందించడం పట్ల అయన అభినందనలు తెలిపారని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తాను వివరించిన పలు విప్లవాత్మక పాలసీ విధానాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవిసృత అవకాశాలను గుర్తించేందుకు హైదరాబాద్‌ నగరానికి రావాలని మంత్రి సిస్కో చైర్మన్‌ ని అహ్వనించారు. తన సొంత రాష్ట్రాన్ని మార్కెట్‌ చేయడానికి రెండు వారాల పాటు విసృతంగా పర్యటిస్తున్న, మంత్రిని, ప్రభుత్వ విధానలను తెలిపిన తీరుని అభినందించిన సిస్కో చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌, మంత్రి అహ్వానం పట్ల సానూకూలంగా స్పందించారు. మంత్రి సిస్కో కేంద్ర కార్యలయంలోని ఏక్స్‌ పీరియన్స్‌ సెంటర్‌ సందర్శించారు.

తర్వాత సాయంత్రం  ఏలక్రికల్స్‌, విద్యుత్‌, ఏవియేషన్‌, ట్రాన్సపొర్ట్‌ వంటి అనేక రంగాల్లో పేరుగాంచిన అతిపెద్ద సంస్ధ జెనరల్‌ ఏలక్రికిల్స్‌ ( జీఈ ) సంస్ధ మాజీ చైర్మన్‌ మరియు సియివో జాక్‌ వెల్చ్‌ తో మంత్రి తారక రామారావు సమావేశమయ్యారు.  తన పదవీ కాలంలో జీ ఈ కంపెనీ విలువను సూమరు 4000 వేల శాతం పెంచిన జాక్‌ వెల్చ్‌ తో సమావేశమవ్వడం పట్ల అయన హర్షం వ్యక్తం చేశారు. జాక్‌ వెల్చ్‌ లాంటి గొప్ప ఏంట్రపెన్యూర్‌ అనుభవం, అయన ఇచ్చిన పలు సలహాలు తమకి భాగ ఉపయోగపడతాయని మంత్రి కె తారక రామారావు అభిప్రాయపడ్డారు. సాయంత్రం శాంతక్లారా కన్వేన్షన్‌ సెంటర్‌ లో జరిగిన  ధి ఇండస్‌ ఏంట్రపెన్యూర్స్‌ (టైకాన్‌)  సమావేశంలో మంత్రి కెతారక రామారావు ప్రసంగించారు. ప్రపంచంలోనే స్టార్టఅప్‌ కంపెనీల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టే  ుతిఇ వెంచర్‌ క్యాపిటల్‌ నెట్‌ వర్క్‌,  ప్రతి ఏడాది ”మక్కా అప్‌ స్టార్ట అప్స్గ్‌”  గా పేరున్న సిలికాల్‌ వ్యాలీలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ప్రంపచంలోని అత్యుత్తమ స్టార్ట అప్స్‌ లోంచి 50 సంస్దలను ఏంచుకుని వారితో నిర్వహిచేం సమావేశంలో తాను పాల్లోనడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి హబ్‌ కార్యక్రమాన్ని వివరించారు. మంత్రి కె .తారక రామా రావు సాయంత్రం సన్‌ మైక్రోసిస్టమ్స్‌ కోఫౌండర్‌ తో వినోధ్‌ కోస్లా భేటీ ఆయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ఐటి కార్యక్రమాలను వినోద్‌ కోస్లాతో పంచుకున్న మంత్రి, సాంకేతిక ప్రపంచంలో వస్తున్న అనేక అధునాతన మార్పులపై అయనతో చర్చించారు.