అమెరికాలో పెరిగిన మధ్య వయస్కుల ఆత్మహత్యలు
వాషింగ్టన్ : గత దశాబ్దంతో పోలిస్తే అమెరికాలోని మధ్య వయస్కుల్లో అత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య 28 శాతం పెరిగినట్లు అధికార వర్గాలు విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. 1999 నుంచి 2010 మధ్యలో ఈ సంఖ్య 40 శాతం పెరిగింది. 35 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న వీరు ఆర్థికమాంద్యం, ఒత్తిడి తదితర కారణాల వల్ల తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నవారి కంటే మందులను అధికంగా తీసుకుని ప్రాణాలు విడిచిన వారే అధికంగా ఉన్నారు. అమెరికా మొత్తం మీద జరిగే ఆత్మహత్యల్లో మధ్య వయస్కుల ఆత్మహత్యలు 57 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.