అమెరికాలో బతుకమ్మ సంబరాలు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 03(జనం సాక్షి)
తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పండుగను అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో అక్కడి భారతీయులు తెలుగు వారు కలిసి సోమవారం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా అక్కడి మహిళలు ఆడుతూ పాడుతూ బతుకమ్మ వేడుకలలో ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో శివమూర్తి, మహేశ్వరి, శ్రావ్య, చంద్రిక తదితరులు పాల్గొన్నారు.