అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

దుండగుడి కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి

న్యూయార్క్‌,నవంబర్‌ 15,(జనంసాక్షి): అమెరికాలో మరోసారి తూటా పేలింది. ఉత్తర కాలిఫోర్నియాలోని థెహామా కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ట్రక్‌ పై వచ్చిన దుండుగుడు రాంచో థెహామా ఎలిమెంటరీ స్కూల్‌ గేట్‌ ను ఢీకొట్టి, చిన్నారులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. బుల్లెట్ల శబ్దంతో స్కూల్‌ ఆవరణ మారుమోగింది. భయంతో విద్యార్ధులు, టీచర్లు తరగతి గదుల్లో దాక్కున్నారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు? అక్కడికి చేరుకోవడంతో వారిపై కూడా కాల్పులు జరిపాడు దుండగుడు. కాసేపు పోలీసులకు, దుండగుడికి మధ్య ¬రా¬రీ కాల్పులు జరిగాయి. పోలీసులు దుండగుడ్ని హతమార్చారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఓ దుండగుడిని మట్టుబెట్టడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులు ప్రాణాలతో బయటపడగలిగారు. దుండగుడు పాఠశాలలోకి చొరబడుతూ కాల్పులు జరపాలనుకున్నట్లు కాలిఫోర్నియా పోలీసులు వెల్లడించారు. దుండగుడు కాల్పులు జరిపిన తీరు చూస్తే చాలా మంది ప్రాణాలు కోల్పోతారనిపించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కాల్పులు జరపడానికి విూ ఆటోమేటిక్‌ రైఫిల్‌, రెండు హ్యాండ్‌ గన్నులు వాడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దుండగుడు కాల్పులు జరపడానికి ముందు తన పక్కింట్లోని వ్యక్తితో గొడవపడ్డాడు. కోపంతో అతన్ని చంపేశాడు కూడా. ఆ తర్వాతే పాఠశాలలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘కాలిఫోర్నియాలో జరిగిన కాల్పులు గురించి తెలిసి చాలా బాధపడ్డాను. అమాయక పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షిస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.