అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం
న్యూయార్క్,జూలై30(జనం సాక్షి): అమెరికాలో ఆదివారం అర్థరాత్రి మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. న్యూ ఆర్లిన్స్ నగరంలో ఇద్దరు సాయుధులు స్థానికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. కాల్పులు జరుగుతుండగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.