అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన
ఖమ్మం: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ‘ అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలు, వ్యక్తిగత భద్రతపై’ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్థానిక భక్త రామదాసు కాళక్షేత్రంలో అవగాహనా సదస్సును నిర్వహంచారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, అవి అందిస్తున్న కోర్సులను విద్యార్థులకు వివరించారు. తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ఉపాధ్యక్షుడు నన్నపనేని మోహన్, జంపాల చౌదరి, జయరాం, తదితరులు సదస్సులో ప్రసంగించారు.