అమెరికాలో హైదరాబాద్ యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ జూన్ 14 (జనంసాక్షి):
కాప్రా పరిధిలోని సుబ్రమణ్యకాలనీలో నివాసముంటున్న అయిల్లా శ్రీహరి ్ణొడ్ పెద్ద కుమారుడు సాయి కిరణ్ ్ణొడ్(23) అమెరికాలో నల్లజాతీయుల చేతిలో ఆదివారం హత్యకు గురయ్యాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంజినీరింగ్ పూర్తి చేసిన సాయి కిరణ్ గత మే 2న అట్లాంటా యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ప్లోరిడాలోని మియామి నగరంలో 11 మంది మిత్రులతో కలిసి నివాసముంటున్నాడు. శనివారం రాత్రి సాయి కిరణ్ తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్ సెల్లార్ వద్ద మిత్రునితో చరవాణిలో మాట్లాడుతుండగా ఇద్దరూ నల్లజాతీయులు వచ్చి చరవాణి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేశారు. అందుకు నిరాకరించిన సాయి కిరణ్‌పై తుపాకీతో నాలుగు /ొండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఘటనా స్థలిలోనే సాయి కిరణ్ కుప్పకూలిపోయాడు. స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. సాయి కిరణ్
మృతి చెందినట్లు తండ్రి శ్రీహరి ్ణొడ్‌కు అతని స్నేహితులు తెలియజేశారు.