అమెరికా ఎందకిలా చేస్తోంది?
కాబూల్,ఆగస్ట్18(జనంసాక్షి): అప్ఘనిస్తాన్ దేశం పరిస్థితి చూసి ప్రపంచం జాలి పడుతోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడంతో ఆ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఊహించుకొని అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది దేశం విడిచి వెళ్లారు. ఇంకా వివిధ మార్గాల ద్వారా వెళ్తూనే ఉన్నారు. అయితే కొందరు మేధావులు రచయితలు ప్రముఖులు అప్ఘాన్ ప్రజలకు ఈ దుస్థితి రావడానికి కారణం అమెరికానేనని ఆరోపిస్తున్నారు. అమెరికా పిరికితనం వల్ల అప్ఘనిస్తాన్ ప్రజలు చిక్కుల్లో పడ్డారని ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికా అప్ఘాన్ లో పోరాటం చేయకుండా వెనుదిరిగినట్లు మరి కొన్ని దేశాలతో ఇలా పోరాటం చేసి చేతులెత్తేసింది. నెల రోజుల కిందట అమెరికా తన బలగాలను అప్ఘనిస్తాన్లో ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో తాలిబన్లు జెడ్ స్పీడ్ వేగంతో దేశాన్ని ఆక్రమించుకున్నారు. అప్పటికే ఎప్పుడు అవకాశం వస్తుందా.. అని ఎదురుచూస్తున్న వారికి అమెరికా ప్రకటనతో తాలిబన్లలో ఉత్సాహం రేకెత్తించినట్లయింది. 2001 సెప్టెంబర్ 21 దాడుల తరువాత అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ అప్ఘనిస్థాన్ పై పట్టు సాధించారు. తీవ్ర వాదుల ఏరివేతపై అమెరికా దృష్టి పెట్టడంతో తాలిబన్లు పారిపోయారు. 20 సంవత్సరాల తరువాత ఇప్పుడు తాలిబన్ల దాడిని తట్టుకోలేని అమెరికా సేనలు ఇప్పుడు పారిపోయాయని ఆప్ఘాన్ ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే అమెరికా అప్ఘాన్ దేశాన్నే కాకుండా ఇదివరకు మరి కొన్ని దేశాలతో పోరాడి వెనక్కి తగ్గిన సంఘటనలు ఉన్నాయి. అగ్రదేశం దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నప్పటికీ ఉత్తర వియత్నాం కమ్యూనిస్టులతో దాడికి చేసింది. ఈ దాడిలో 58 వేల అమెరికన్ సైనికులు మరణించారు. దీనికి అమెరికాలో తీవ్ర నిరసనలు ప్రారంభమయ్యాయి. దీంతో 1973లో పారిస్ శాంతి ఒప్పందం పేరుతో 1973లో అయితే వియత్నాంను అమెరికా విడిచిపెట్టింది. రెండు సంవత్సరాల తరువాత దక్షిన వియత్నాంను కమ్యూనిస్టు సేనలు ఆక్రమించాయి. ఇందులో అమెరికన్లను రక్షించడానికి అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ వియత్నాం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. 1993లో అక్టోబర్లో ఆఫ్రికా దేశమైన సోమాలియా విషయంలోనూ అమెరికా ఇదే పని చేసింది. 1991 జనవరిలో అనేక తెగ వ్యతిరేక మిలీషియాలు తిరుగుబాటు గ్రూపులు సోమాలియా అధ్యక్షుడు మొహమ్మద్ సియాద్ బారెన్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సోమాలియా జాతీయ సైన్యంలోని కొన్ని బలగాలు సాయుధ సమూహాలలో చేరాని దీంతో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సోమలియాలు అంతర్యుద్ధం ప్రారంభించారు. దీంతో రాజధాని మొగాడిషులో ప్రధాన తిరుగుబాటు వర్గమైన యునైటెడ్ సోమాలియా కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గానికి అలీ మోహిదీ మహమ్మద్ అధ్యక్షుడయ్యాడు. మరో వర్గాన్ని మహ్మద్ ఫరా అద్ధిది నిర్వహించాడు. ఈ క్రమంలో సోమాలియా -2 సాధారణ ప్రజలకు సాయం చేయడానికి ముందకు వచ్చింది. అయితే అద్దిది సన్నిహితులను పట్టుకోవడానికి అమెరికా సైన్యం ఆర్మీ టాస్క్ పోర్స్ ను రంగంలోకి దించింది. దీంతో తిరుగుబాటు దారులు అమెరికా సేనల హెలీ క్యాప్టర్లను కూల్చివేశారు. అలా 19 మంది అమెరికా సైనికులు మరణించారు. ఒకరిని పట్టుకొని అతి కష్టం మీద విడుదల చేసింది. ఆ తరువాత పాకిస్థాన్ సైన్యం సహయంతో అమెరికా సైన్యాన్ని తిరుగుబాటుదారులు పోరాటం చేశారు. చివరికి అమెరికా బలగాలు సోమాలియా నుంచి వెనక్కి తిరిగారు. ఇక అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్. కెన్నెడీ ఉన్న సమయంలో క్యూబా పోరాటంలోనూ ఇదే జరిగింది. జాన్ ఎఫ్. కెన్నెడీ అతని భార్య జాక్వెలిన్ కెన్నెడీ బే ఆఫ్ పిగ్స్ దాడిలో పాల్గొన్న 2506 బ్రిగేడ్ మయామిలోని స్టేడియంలో కలుసుకొన్నారు. అంతకుముందు రష్యా క్యూబాలో అణు క్షిపణులను మోహరించింది. యూఎస్ నావికదళాన్ని ముట్టడిరచింది. సోవియన్ క్షిపణిని తొలగించకపోతే అణు యుద్ధం తప్పదని అమెరికా హెచ్చరించింది. అయినా సోవియట్ బెదరలేదు. కానీ రష్యా క్షిపణులను మోహరించలేదు. ఆ తరువాత కెన్నెడీ క్యూబా నుండి పారిపోతున్నట్లు క్యూబా పేర్కొంది. అయితే ఆ తరువాత క్యూబాపై ఐదు సార్లు దాడికి ప్రయత్నించినా విజయవంతం కాలేదు.