అమెరికా జడ్జిగా భారతీయ-అమెరికన్ శ్రీనివాసన్?
వాషింగ్టన్: అమెరికాలోని ప్రతిష్టాత్మక వాషింగ్టన్ డి.సి అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్ న్యాయ కోవిదుడు శ్రీకాంత్ ‘శ్రీ’శ్రీనివాసన్ నియామకం దాదాపు ఖరారైంది. వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన సేనేట్ న్యాయ వ్యవస్ధ కమీటీ సమావేశంలో విపక్ష రిపబ్లికన్ సెనేటర్లు సైతం శ్రీనివాసన్ నియామకం పై ఏకాబిప్రాయం వ్యక్తం చేపినట్లు తెలిసింది. దేశాద్యక్షుడు బరాక్ ఒబామ ‘ట్రెయిల్‌బ్లేజర్’ (మార్గదర్శకుడు)గా పిలిచే శ్రీనివాసన్ నియామకం ఒకవేల ఖరారైతే అమెరికాలో మొత్తంమీద ఏ ఫెడరల్ జడ్జి పదవికైనా ఎంపికైన మూడో దక్షిణాసియా వ్యక్తి అవుతారు. ప్రస్తుతం ఆయన అమెరికా డిప్యూటి సోలిసిటర్ జనరల్‌గా పని చేస్తున్నారు. పంజాబ్‌లోని చండిగడ్‌లో పుట్టిన శ్రీనివాసన్ అమెరికాలోని కాన్సస్‌లో పెరిగి అక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు