అమెరికా నైట్‌క్లబ్‌లో నరమేధం

C

– 50 మంది మృతి

– మరో 53 మందికి గాయాలు

ఓర్లాండో,జూన్‌ 12(జనంసాక్షి):అమెరికా చరిత్రలో మరో పాశవిక నరమేధం. ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలోని పల్స్‌ గే నైట్‌ క్లబ్‌ లోకి చొరబడ్డ సాయుధుడు 50 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో 53 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు పల్స్‌ నైట్‌ క్లబ్‌ లోకి మారణాయుధాలతో ఓ సాయుధుడు చొరబడ్డాడని, పలువురిపై కాల్పులు జరిపి, ఇంకొందరిని బందీలుగా పట్టుకున్నాడని ఓర్లాండో పోలీసులు తెలిపారు. నాలుగు గంటల ఉత్కంఠత అనంతరం పోలీసులు దుండగుణ్ని మట్టుపెట్టారు. రెండు రోజుల కిందట పాప్‌ సింగర్‌ క్రిస్టినా గ్రివ్మిూని కాల్చిచంపిన ఓర్లాండో సిటీలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గే నైట్‌ క్లబ్‌ లో కాల్పులపై స్థానిక విూడియా పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం  చేసింది. కాల్పులు ప్రారంభమైన వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి దూరంగా పారిపోండంటూ క్లబ్‌ నిర్వాహకులు కస్టమర్లకు మెసేజ్‌ లు పెట్టారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఘటన తీవ్రత దృష్ట్యా క్లబ్‌ వద్దకు భారీగా చేకున్న పోలీసులు.. 4 గంటల తర్వాత దుండగుణ్ని అంతం చేశారు.  నిందితుడు ఏ కారణంతో కాల్పులకు పాల్పడింది తెలియాల్సి ఉంది.ఇదిలా వుండగా గతంలో కూడా అమెరికాలోఇలాంటి దుర్ఘటనే చోటు చేసుకుంది. ఆర్లాండోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్‌, ‘ది వాయిస్‌’ స్టార్‌ క్రిస్టినా గ్రివ్మిూపై ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో గ్రివ్మిూ అక్కడికక్కడే మృతి చెందారని ఆర్లాండో పోలీసులు వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆర్లాండోలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆమె బ్యాండ్‌ ‘బి ఫోర్‌ యు ఎగ్జిట్‌’ ప్రదర్శన ముగిశాక  ప్రేక్షకులకు ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.సుమారు 60 మంది వరకు పాల్గొన్న కార్యక్రమంలో గ్రివ్మిూని లక్ష్యంగా చేసుకొనే కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి గ్రివ్మిూకి తెలిసిన వ్యక్తేనా లేక సోషల్‌ విూడియాలో ఆమెను అభిమానించే క్రేజీ ఫాలోవరా అనే విషయం దృవీకరించాల్సి ఉందని ఆర్లాండో పోలీసు అధికారి వాండా మిగ్లియో తెలిపారు. కాగా కాల్పులకు పాల్పడిన వ్యక్తిని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు చెందిన కెవిన్‌ జేమ్స్‌

(27)గా గుర్తించారు. కేవలం గ్రివ్మిూని చంపే ఉద్దేశంతోనే అతడు ఆమె ప్రదర్శన నిర్వహిస్తున్న చోటుకు వచ్చాడని పోలీసులు నిర్థారించారు.గ్రివ్మిూపై కాల్పులు జరిపిన అనంతరం కెవిన్‌ జేమ్స్‌ కూడా తనకు తాను కాల్చకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే గ్రివ్మిూ సోదరుడు మార్క్‌ గ్రివ్మిూ కాల్పులకు పాల్పడిన కెవిన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడని..

అయితే ఆ క్రమంలోనే కెవిన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. హంతకుడు కెవిన్‌ ఇంటి దగ్గర ఓ లేఖను గుర్తించారు. దానిలో గ్రివ్మిూని టాలెంటెడ్‌, లవింగ్‌ సింగర్‌గా పేర్కొన్న కెవిన్‌.. ఆమె కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌, అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. లేఖను బట్టి చూస్తే గ్రివ్మిూని చంపాలని ముందుగానే కెవిన్‌ నిర్ణయించుకున్నట్లు

స్పష్టం అవుతోంది. గ్రివ్మిూకి కెవిన్‌ వీర ఫ్యాన్‌ అని తెలుస్తోంది.