అమెరికా ప‌న్నుల్లో ఆరు శాతం భార‌తీయుల‌దే: రిప‌బ్లిక‌న్ నేత‌

 

 

 

 

 

 

అమెరికా జ‌నాభాలో భార‌తీయులు కేవ‌లం ఒక శాతం మాత్ర‌మే ఉన్నార‌ని, కానీ వాళ్లు చెల్లిస్తున్న ప‌న్ను ఆరు శాత‌మ‌ని రిప‌బ్లిక‌న్ నేత మెక్‌కార్మిక్ తెలిపారు. అమెరికా కాంగ్రెస్‌లో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయుల వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేద‌ని, వాళ్లు చ‌ట్టాల్ని ఫాలో అవుతార‌న్నారు. త‌మ క‌మ్యూనిటీలో ఉన్న అయిదుగురు డాక్ట‌ర్ల‌లో ఒక‌రు ఇండియ‌న్ అని, భార‌తీయ అమెరిక‌న్లు గొప్ప దేశ‌భ‌క్తులు అని, మంచి మిత్రులు అని తెలిపారు. అమెరికా స‌మాజంలో భార‌తీయుల జ‌నాభా ఒక శాతం మాత్ర‌మే ఉన్నా.. వాళ్లు క‌డుతున్న ప‌న్ను మాత్రం ఆరు శాత‌మ‌ని మెక్‌కార్మిక్ చెప్పారు.
మెక్‌కార్మిక్ వృత్తిరీత్యా ఫిజిషియ‌న్‌. జార్జియా జిల్లా నుంచి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అట్లాంటాలో ఉన్న నార్త‌ర్న్ ప్రాంతాలు దీంట్లో ఉన్నాయి. డెమోక్ర‌టిక్ నేత బాబ్ క్రిస్టియ‌న్‌ను ఆయ‌న న‌వంబ‌ర్‌లో జ‌రిగిన మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో ఓడించారు.