అమ్మ జన్మనిస్తుంది..

4

గురువు జీవితాన్నిస్తాడు

ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(జనంసాక్షి):

తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దివంగత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవం సందర్భంగా దిల్లీలోని మానెక్‌షా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని విద్యార్థులతో ముచ్చటిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విద్యార్థుల వల్లే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందన్నారు. గొప్ప వైద్యులైనా, శాస్త్రవేత్తలైనా వారి వెనుక గురువులు ఉంటారన్నారు. మన   మనసులపై కూడా గురువుల ప్రభావం ఉంటుందన్నారు. తల్లి జన్మనిస్తుంది… గురువు జీవితాన్ని ఇస్తాడని పేర్కొన్నారు. తనను ఉపాధ్యాయుడిగా ప్రజలు గుర్తుంచుకోవాలని కలాం అనేవారని ప్రధాని గుర్తు చేశారు. అబ్దుల్‌ కలాం ప్రతిక్షణం కొత్త ప్రతిభను అన్వేషించేవారన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్మరణార్థం ప్రధాని నాణెం విడుదల చేశారు.గురుపూజోత్సవం సందర్భంగా దిల్లీలోని మానెక్‌షా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్మరణార్థం ప్రధాని మోదీ నాణెం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో   9 రాష్టాల్రకు చెందిన విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ముచ్చటించారు. విద్యార్థుల వల్లే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందంటూ  మన మనసులపై కూడా గురువు ప్రభావం అధికంగా ఉంటుందన్నారు.  విద్యార్థులు ఎక్కువ సమయం గురువులతోనే గడుపుతారు. ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదు. దివంగత రాష్ట్రపతి కలాం తనను ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకోవాలని కోరుకునేవారని పేర్కొన్నారు.

సెప్టెంబరు 5న దేశవ్యాప్తంగా జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు దిల్లీలోని మానెక్‌షా ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమం అన్ని టెలివిజన్‌ ఛానెల్స్‌లో ప్రసారమయ్యింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని బధిరుల పాఠశాలలో విద్యార్థులు ఈ ప్రసంగాన్ని శ్రద్ధగా తిలకించారు. ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సైగలు చేసి మరీ ఆయన మాట్లాడిన దాన్ని వారికి అర్థమయ్యేలా తెలియజేశారు.