అరగంట వ్యాయామంతో దూరమయ్యే ధూమపానం
వాషింగ్టన్, ధూమపానం మానేయడానికి ఓ పరిష్కారాన్ని పరిషోధకులు సూచిచారు. ముఖ్యంగా టీనేజర్లు రోజుకు అరగంట వ్యాయామం లేదా వాకింగ్ చేస్తే ధూమపానాన్ని మానేయవచ్చని తేల్చారు. పూర్తిగా మానేయలేక పోయినా, చాలా వరకు ధూమపానాన్ని నియంత్రించేందుకు శారీరక శ్రమ ఉపయోగపడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇలా రోజుకు అర గంట వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే రసాయనం విడుదలవుతుందని, అది ధూమపానం వద్దనే సంకేతాలను పంపుతుందని వెల్లడైంది.అమెరికాలో అత్యధిక ధూమపానం చేసే వర్జీనియాలో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ సర్వీసెస్ అధ్యయనం నిర్వహించింది.