అరబిందో ఫార్మా 5కోట్ల విరాళం

హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  హైదరబాద్‌ వరద బాధితులను ఆదుకునేందుకు అరబిందో ఫార్మా కంపెనీ ముందుకు వచ్చింది. వరద బాధితులకు సహాయక చర్యల కోసం అరబిందో ఫార్మా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను అరబిందో ఫార్మా కంపెనీ ప్రతినిధులు కలిసి చెక్కును అందజేశారు. విూనాక్షి ఇన్‌ఫ్రాస్టక్చ్రర్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ కంపెనీ ప్రతినిధులు కూడా కేటీఆర్‌కు చెక్కు అందజేశారు. అరబిందో ఫార్మా, విూనాక్షి ఇన్‌ఫ్రాస్టక్చ్రర్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.