అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన

2

న్యూఢిల్లీ,జనవరి26(జనంసాక్షి):లో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. గత కొంతకాలంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ను తొలగించేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 21 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెట్లు కలిసి డిప్యూటీ స్పీకర్‌ కు మద్దతు పలికారు. ఆయన అధ్యక్షతన ఒక ¬టల్‌ లో అసెంబ్లీ ఏర్పాటు చేసి, కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ వ్యవహారంపై స్పీకర్‌ గౌహతి హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. తిరుగుబాటు ఎమ్మెల్యేల నిర్ణయంపై స్టే విధించింది. రాష్ట్రపతి పాలన విధింపుపై న్యాయపరంగా పోరాడుతామన్నారు మాజీ సీఎం నబమ్‌ తకీ. ఇది ఊహించిన పరిణామమే అని, గవర్నర్‌ చెబుతున్నట్లుగా అరుణాచల్‌ ప్రదేశ్‌ లో శాంతి భద్రతలకు వచ్చిన సమస్య ఏవిూ లేదన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ లో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మొదట ఆమోదించలేదు. అత్యవసరంగా తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర మంత్రులతో చర్చించిన తర్వాత ఆమోదం తెలిపారు.