‘అర్జున్‌ రెడ్డి’కి మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు

హైదరాబాద్‌,ఆగస్టు28 : అర్జున్‌ రెడ్డి చిత్ర బృందంపై రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం సోషల్‌ విూడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రత్యేకించి హీరో విజయ్‌ దేవరకొండ నటన అద్భుతంగా ఉందని ట్విటర్‌ లో పోస్ట్‌ చేశారు. విజయ్‌ దేవరకొండ నువ్వు రాక్‌స్టార్‌ అని ట్వీట్‌ చేశారు. ఇది నిజాయతీ కలిగిన అసలైన, బోల్డ్‌, దీటైన చిత్రమని చెప్పారు. దర్శకుడు సందీప్‌ రెడ్డికి, నిర్మాత ప్రణయ్‌కు అభినందనలు తెలిపారు. అర్జున్‌ రెడ్డి చిత్రంలో

షాలిని పాండే కథానాయికగా నటించారు. ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం నవతరం ‘దేవదాసు’లా ఉందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రం కలెక్షన్లు కురిపిస్తోంది.