అర్దరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 141 మందిఅరెస్ట్
నాలుగు డివిజన్లలో ఏకకాలంలో దాడులు
పట్టుబడ్డ దళిత నాయకుడు గజ్జెల కాంతం
తనిఖీకి నిరాకరించడమేకాక పోలీస్‌లతో వాగ్వివాదం
రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు
కరీంనగర్,అక్టోబర్ 28(జనంసాక్షి): జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిస్తున్న వారిపై జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పోలీస్ కవిూషనరేట్ పరిధిలోని నాలగు డివిజన్లలో పోలీస్ ఉన్నతాధికారులు అర్దరాత్రి 12 గంటలనుంచి తెల్లవారు జామున 3 గంటలవరకు నిర్వహించారు. దీంతో రాత్రంతా జిల్లాలో ఉద్రిక్త వాతావరణమే నెలకొందని ఓకమాటలో చెప్పవచ్చు. ఉన్నతాదికారులు నేరుగా రంగంలోకి దిగి అర్దరాత్రి దాటిన తర్వాత తనిఖీలు చేయ డంతో 141 మందిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర డివిజన్‌లో నిర్వహించిన 56 తనిఖీలలో 56 మంది అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న సంఘటనలు రెండింటిపై దాడులు నిర్వహించగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈదాడుల్లో స్వయం గా కవిూషనర్ విబి కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు. దళితనేత గజ్జెల కాంతం మద్యం సేవించి వాహనాన్ని నడుపుతుండగా తారసపడగా పోలీస్‌లు అయన వాహనాన్ని కూడా నిలిపారు.అయితె ఆయన పోలీస్‌లకు సహకరించకుండా వాగ్వివాదానికి దిగారు., డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించి నేరుగా తాను బసచేస్తున్న ఆర్‌అండ్‌బి వసతిగృహానికి చేరుకున్నారు. దీంతో నగరఎసిపి రామా రావు, సీఐలు వసతి గృహానికి వెల్లి మాట్లాడినా కూడా పలితం లేకపోవడంతో మూడు గంటల సమయంలో అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెల్లారు. సుమారు రెండుగంటలపాటు హైడ్రామా కొనసాగింది. రూరల్ డివిజన్‌లో ఆరుగురిని పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మూడు చోట్ల తనిఖీలు చేయగా 15 మందిని పట్టుకున్నారు. ట్రాఫిక్ డివిజన్ అధికారులు నిర్వహించిన 52 తనిఖీల్లో 52 మందిని అరెస్ట్ చేశారు. హుజురాబాద్ డివిజన్‌లో 27 తనిఖీలు నిర్వహించగా 27 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 141 తనిఖీలు చేయగా 141 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక 5చోట్ల బహిరంగ ప్రదేశాలపై దాడులు చేసి 18 మందిని అరెస్ట్ చేశారు.