అర్హులందరికీ డబుల్ ఇళ్లు: ఎమ్మెల్యే
ఆదిలాబాద్,ఫిబ్రవరి7(జనంసాక్షి):రాబోయే రోజుల్లో అర్హులైన వారందరికి రెండు పడకగదుల ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదపి ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. ఎమ్మెల్యేలు దగ్గరుండి నిర్మాణాలు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పలువురు టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. మహిళలు నేడు అన్ని రంగాల్లో ఎంతో రాణిస్తున్నారని, సీఎం కేసీఆర్ కూడా వారి అభ్యున్నతికి ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెరాస పాలనలోనే ప్రజల బతుకులు బాగుపడుతున్నాయని పేర్కొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం మొదటిస్థానం సాధించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రేఖానాయక్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా అభివృద్ది చెందాలన్నారు. ఖానాపూర్ నియోజకవర్గానికి ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించి, రాష్ట్రంలోనే మొదటిస్థానం సాధించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో లక్ష్యాన్ని అధిగమిస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి అన్ని వర్గాల ప్రజలు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు.