అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలి…
పెనుబల్లి జూలై 18(జనం సాక్షి): తెలంగాణ లో కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశ పెడతానాన్న గృహలక్ష్మి పథకం గ్రామాలలో అర్హులైన ప్రతి వారికి అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు గాయం తిరుపతిరావుప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, మండాలపాడు గ్రామంలోమంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం కూలీలతో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి ప్రతి ఒక్క లబ్ధిదారు నికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్ష లు, బి జె పి ప్రభుత్వం రూ.10లక్ష లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు,బి ఆర్ ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అనేక పథకాలను ప్రవేశ పెడుతూ అందని ద్రాక్షలా ఏ ఒక్క పథకాన్ని సమర్థవంతంగా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందించడం లేదనిఅన్నారు,కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజలను, ప్రజల అవసరాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల దృష్టిని మరల్చి వేస్తుందని అన్నారు, ప్రజల అవసరాలను గుర్తించకుండా ప్రజలను ఏళ్ల తరబడి ఇబ్బందులు గురి చేస్తూ ప్రకటించిన పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై న, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలపై న వ్యవసాయ కార్మికులను ఏకం చేసి పోరా టాలతో గృహలక్ష్మి పథకాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కూలీలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.