అర్హులైన పేదలందరికీ పెన్షన్ మంజూరు చేయాలి..
సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తు గడువు పెంచాలి
మిర్యాలగూడ. జనం సాక్షి.
అర్హులైన పేదలందరికీ ఆసరా పెన్షన్లు అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో డి ఏ ఓ రాధ కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వన్ టౌన్ టూ టౌన్ కార్యదర్శులు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి భవాండ్ల పాండు, మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పెన్షన్లలో చాలామంది అర్హులైన పేదలకు పెన్షన్ మంజూరు కాలేదని వాపోయారు. నిజమైన అర్హులకు పెన్షన్ రావడం లేదన్నారు. గత సంవత్సరం ఆగస్టులో దరఖాస్తుల స్వీకరించారని వాటిలో కొన్నింటిని మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. గతంలో దరఖాస్తు చేస్తున్న వారిలో వందలాదిమంది పేదలు అర్హులుగా ఉన్నారని, కొత్తగా సంవత్సర కాలంగా వేలాదిమంది అర్హత పొందారని తెలిపారు. ఈనెల 31 వరకు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేశారే తప్ప ఆన్లైన్లో దరఖాస్తు కావడం లేదని తెలిపారు. గడుగు ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉన్నాయని గడువును సెప్టెంబర్ 10 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆన్లైన్లో లాగిన్ ఓపెన్ చేసి అర్హులైన పేదలందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రేమిడాల పరుశురాములు, కోడైరెక్క మల్లయ్య, యేసు, మల్లయ్య, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.