అర్హులైన పోడు రైతులకు న్యాయం చేయాలి
అర్హులైన పోడు దారులందరికి న్యాయం చేయాలని మండలంలోని నాచారం గ్రామం ఆర్ఓఎఫ్ఆర్ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి, జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ నాచారం లో ఆన్లైన్లో నమోదు చేసిన పోడు దారులందరికి అటవీ హక్కు పట్టా పత్రాలు ఇవ్వాలని అన్నారు. కమిటీ సభ్యులు ఇటీవల పలు అక్రమాలకు పాల్పడుతున్నారని వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆ వాఖ్యలు అవాస్తవం అన్నారు. గ్రామంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి తదితర నిరుపేద పోడు రైతులకు న్యాయం జరిగేలా ఆర్ఓఎఫ్ఆర్ కమిటీ కృషి చేస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు.