అర్హులైన లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, జనం సాక్షి.
జీ.ఓ 58 కింద అర్హులైన లబ్ధిదారులకు బుధవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చే జారి చేయబడిన మిర్యాలగూడ మున్సిపాలిటికి చెందిన 49 మంది (వార్డ్ 2,3,6,7,10,11,16,30,32) లబ్దిదారులకు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి ఇండ్ల పట్టాలను మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బి. చెన్నయ్య, తహసిల్దార్ అనిల్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, సీనియర్ నాయకులుఅన్నభిమోజునాగార్జున చారి, కౌన్సిలర్లు బాసాని అలివేలు గిరి, బంటు రమేశ్, సాదినేని స్రవంతి శ్రీనివాస్ రావు, కర్నేఇందిరా గోవింద్ రెడ్డి, కుర్ర చైతన్య, అమృతం దుర్గా సత్యం, మాజీద్, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, గొంగిడి సైదిరెడ్డి, సందేషి అంజన్ రాజు, దైదా సోము సుందర్, ఘంట శ్రవణ్ రెడ్డి, కందగట్ల అశోక్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, తెలుకుంట్ల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.