అలంపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్
మహబూబ్‌నగర్,ఆగస్టు 11(జనంసాక్షి):కృష్ణా పుష్కరాల కోసం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అలంపూర్‌కు చేరుకున్నారు. అక్కడి హరిత టూరిజం ¬టల్ వద్ద ఆయనకు టూరిజం ఛైర్మన్ పేర్వారం రాములుతోపాటు పలువురు నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి ఆయన హరిత టూరిజం ¬టల్‌లో బస చేయనున్నారు.గొందిమల్లలో రేపు ఉదయం 6 గంటలకు సీఎం కేసీఆర్ కృష్ణా నదిలో పుణ్యస్నానం ఆచరించి పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం ఉయదం 7 గంటలకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అల్పాహారం తర్వాత అలంపూర్ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.కాగా, తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదికి తొలిసారిగా పుష్కరాలు వస్తున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి ఈనెల 23 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. సుమారు 3 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తారని అధికారులు అంఛనా వేస్తున్నారు.
సిఎం రాకతో పటిష్ట భద్రత
తెలంగాణలో కృష్ణా నదిలో జళకళ ఉట్టిపడుతోంది. దీంతో కృష్ణా పుష్కరాలకు సర్వం సిద్దమైంది. మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్లలో శుక్రవరాం తెల్లవారుజామున సీఎం కేసీఆర్, పీఠాధిపతులు పుణ్యస్నానాలు చేసి పుష్కరాలను ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలిపుష్కరాలు కావడంతో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పుష్కరాల ప్రారంభ ముహూర్తం ఖరారు కావడం, సిఎం తదితరుల రానుండడంతో భారీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ టికె శ్రీదేవి తెలిపారు. శుక్రవారం ఉదయం 5:55 గంటల నుంచి 6 గంటల మధ్య పుష్కరాలు ప్రారంభిస్తారు. మొదటగా మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్ల వద్ద పీఠాధిపతులు, ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యస్నానం చేస్తారు. పుష్కరస్నానం చేసేందుకు మధ్యాహ్నమే సీఎం కేసీఆర్ ఆలంపూర్ చేరుకుని జోగులాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడే బస చేసే అవకాశం కూడా ఉంది. దీంతో ఆలంపూర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ఉదయం 5 గంటలకల్లా సవిూపంలోని గొందిమళ్ల ఘాట్‌కు వెళ్తారు. సీఎం రాక సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఇటు పవిత్ర కృష్ణా పుష్కరాల కోసం పాలమూరు జిల్లాలోని ఘాట్లు సిద్దమయ్యాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటాయని భావిస్తున్న బీచ్‌పల్లి, రంగాపూర్, గొందిమళ్ల ఘాట్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీనికితోడు తెలంగాణలో కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కొన్నిచోట్ల పుష్కరఘాట్లు నీటిలో మునిగాయి. కృష్ణా పుష్కరాలకు వచ్చిన భక్తులు క్షేమంగా పుణ్యస్నానాలు ఆచరించి వెళ్లేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలని, పుణ్య కార్యక్రమానికి అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి అన్నారు. సిఎం కెసిఆర్ రాకతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులతోపాటు భద్రత ఏర్పాట్లలో ఉన్న సిబ్బంది కోసం అన్ని వసతులు కల్పించినట్టు తెలిపారు. వైద్య సేవలకు, వసతుల కోసం ఏర్పాట్లు జరిగాయని అన్నారు. పుష్కరాల విజయవంతం కావాలంటే బాధ్యత పోలీసు అధికారులు, సిబ్బందిదే అని అన్నారు. విధుల్లో ఉన్న అధికారుల పర్యవేక్షణకు లైజనింగ్ అధికారులను నియమించినట్టు తెలిపారు. మంచి సేవలు అందించి పోలీసులకు మంచి పేరు తెస్తారన్న నమ్మకం ఉందని ఎస్పీ అన్నారు.




