అలా వచ్చాడు.. ఇలా వెళ్ళాడు…
కెసిఆర్ కు బైపోల్ భయంతో జిల్లాల పర్యటన
-12 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం.
-ఎఐఎఫ్ బి రాష్ర్ట ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి
కరీంనగర్ టౌన్ ఆగష్టు 30(జనం సాక్షి)
కెసిఆర్ కు మునుగోడు బైపోల్ భయం పట్టుకుందనీ అందుకే ఫాంహౌస్ వీడి జిల్లాల పర్యటనలు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు అన్నారు సోమవారం పెద్దపల్లి నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కెసిఆర్ ప్రజానీకానికి ఎటువంటి హమీలు ఇవ్వకుండ వెనుతిరిగడం నిరాశపర్చిందని అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లిలో సీఎం బహిరంగ సభలో ఊకదంపుడు ఉపన్యాసం తప్ప జిల్లా ప్రజానీకానికి ఎటువంటి హమీ ఇవ్వలేదు అన్నారు.సీఎం కెసిఆర్ పెద్దపల్లి పర్యటనకు 12 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియాగం చేశారన్నారు.. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన డిఎంఎఫ్టి,నిధులను 1000 కోట్ల సొమ్మును ఇతర జిల్లాలకు ఎత్తుకెళ్తునా ఇక్కడి మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్లే దాసరి మనోహర్ రెడ్డి అభ్యంతరం తెలపకపోవడం వీరి అసమర్ధతకు నిదర్శనమని అన్నారు,సీఎం కెసిఆర్,ఎస్సారెస్పీ ప్రాజెక్టు గురుంచి మాట్లాడటం విడ్డూరంగ ఉందన్నారు. ఎస్సారెస్పీ ఒక్క కాలువ నిర్మాణం పొడగింపు కానీ,ఒక్క షెట్టర్ మరమత్తు చేసింది లేదనీ ఒక డ్రాప్ కట్టింది లేదు అని తెలిపారు.నీళ్లు ఎత్తుకెళ్ళి ఇక్కడ పంటలను ఎండపెట్టారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయని .ప్రస్తుతం తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ల రావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం . మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్ర నేడు సీఎం కెసిఆర్ ప్రభుత్వం ద్వారా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కి వెళ్ళింది.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి పనికి కాంట్రాక్టు పనులన్నీ. మెగా క్రిష్ణా రెడ్డి కి సీఎం కేసీఆర్ ఇస్తున్నారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు వినిపిస్తున్న వాటిని గాలికి వద్గిలేస్తున్నారని విమర్శించారు.పెద్దపల్లి జిల్లాలో ఇసుక దందా, రేషన్ బియ్యం మాఫియా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో కమిషన్ ల వ్యాపారం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అదుపు లేకుండా పోయిందని అన్నారు.