అవకతవకలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోండి
– వాటర్ గ్రిడ్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి):
పథకం ఏదైనా పకడ్బందీగా ముం దుకు వెళ్తోంది తెలంగాణ ప్రభు త్వం. ఎక్కడా అవకతవకలు జర కుండా ముందస్తు చర్యలు తీసు కుంటోంది. ఈ మేరకు ఇంటిం టికి మంచి నీళ్లందించే ప్రాజెక్టులో ఏ లోపం జరకుండా జాగ్రత్త వ హించాలని అధికారులను ఆదేశిం చారు ముఖ్యమంత్రి కేసీఆర్. వాట ర్ గ్రిడ్ పథకంపై కేసీఆర్ సవిూక్షా సమావేశం నిర్వహించారు. సచివా లయంలో జరిగిన ఈ సమా వేశంలో మంత్రి కేటీఆర్, పంచా యతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమం డ్ పీటర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రాంచంద్రన్, పంచాయతీరాజ్ ఇ అండ్ సి సురేందర్‌రెడ్డి సీఎం అదనపు కా ర్యదర్శి స్మితా సబర్వాల్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నా రు. వాటర్‌గ్రిడ్
ప్రాజెక్టు పురోగతిపై సవిూక్ష నిర్వహించిన కేసీఆర్.. ఇంటెక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఇతర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రజలకు మంచి నీరు అందించడం అత్యంత ప్రాధాన్యమైన నేపథ్యంలో అధికారులు పనులను చాలా శ్రద్ధగా చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనుల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని.. ప్రతి రోజు పనుల పురోగతిపై సవిూక్ష నిర్వహించుకోవాలన్నారు. ఏ జిల్లాకు, ఏ మండలానికి ఏ రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తారనే విషయంపై అధికారులతో చర్చించిన సీఎం.. పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రజలు వాటర్ గ్రిడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు.