అవకాశం ఇచ్చి గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తా
మాజీ మంత్రి, బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 25, (జనంసాక్షి) :
అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తానని మాజీ మంత్రి, బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని వివిధ వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎండ్ల తరబడి నెలకొని ఎన్న సమ్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బెల్లింపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉందని, దీనికి కారణం గత పాలకుల నిర్లక్ష్య వైఖరి అని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గంలో మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, విశాఖట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజా సేవ కోసమే రాజకీయాలలోకి వచ్చానని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా చేసుకోని ప్రజలతో మమేకమై ముందుకు వెళ్తున్నామని అన్నారు. మాది పైసలు ఇచ్చే కుటుంబమే అని, పైసలు పుచ్చుకునే కుటుంబం కాదని, మా కుటుంబానికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని, కేవలం బెల్లంపల్లిని అభివృద్ధి చేసేందుకే ఎమ్మెల్యేగా పోటి చేస్తున్నాని అన్నారు. అనంతరం కాసిరెడ్డిపల్లి, బూదె గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపిటిసి బరిగెల తారా, బొప్ప అర్జయ్యతో పాటు 100 మందికి పైగా వినోద్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వినోద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం గోపాల్, మాజీ ఎమ్మ్ణెల్యే శ్రీదేవి, మున్సిపల్ చైర్మన్ మునిమంద స్వరూప-రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, కౌన్సిలర్లు, బిఎస్పీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.