అవినీతికి కేంద్రంగా రీడిజైనింగ్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు కారణం అవినీతి ప్రణాళిక అని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికే నిజాలు దాస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము కోరుతుండగా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. ముందస్తుకు వెలితే టిఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదన్నారు. ఈ ఎన్‌ఇనకల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు భయపెడుతున్నారని నిందించారు. వాస్తవాలను కప్పిపుచ్చి గొప్పలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రతో సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందం ఈ కోవకే వస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూపొందించిన గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిందని పేర్కొంటూ దాని ప్రభావం ఎస్సారెస్పీపై పడుతుందన్నారు. విధాన రూపకల్పన లోటుపోట్లు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు.

——————