అవినీతి నిర్మూలన మన నుంచే మొదలుపెట్టాలి: అబ్దుల్‌ కలాం

హైదరబాద్‌: అవినీతిని నిర్మూలించాలనునేవారంతా మొదట తమ ఇంటినుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సూచించారు. వంద కోట్ల జనాభా దాటిన మన దేశంలో అంతకు మూడు రెట్లు గృహనిర్మాణాలున్నాయని ఆయన చెప్పారు. వీటిల్లో 30 శాతం మేర అవినీతి సోమ్ముతోనే నిర్మించినవని ఆయన వ్మాఖ్యనించారు. నగరంలోని సెంయిట్‌ ఆన్స్‌ జూనియర్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగిచారు. విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులిచ్చిన కలాం పలువురు ఆదర్శ మూర్తుల జీవితా విశేషాలు చెప్పి వారికి మార్గ నిర్థేశనం చేశారు. బలమైన లోక్‌పాల్‌ అమల్లోకి వస్తే అవినీతి అదుపులోకి వస్తుందని కలాం చెప్పారు. విధ్యత ఉత్పత్తి సాధించడానికి సహజ వపనరుల పై ఆధారపడడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త పరిశోధనల ద్వారా సౌర, తరంగ అణు, బయోగ్మాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిని ఉందని ఆయన చెప్పారు.