అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారు: జూలకంటి

నల్గొండ, జనంసాక్షి: రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారుని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లివారిని కష్టాల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై పెద్ద ఉత్తున ఉద్యమం చేపడతామని జూలకంటి తెలిపారు.