అవుట్ లుక్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలి
– ప్రొఫెసర్ కోదండరామ్
వికారాబాద్ జులై1(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌పై తప్పుడు కథనాలు రాసిన ‘అవుట్‌లుక్’ యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాజకీయ ఐకాస ా’య్రర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలంలో విలేకరులతో మాట్లాడారు. పత్రికలు ప్రజలు మెచ్చే కథనాలు రాయాలి తప్ప వారిని మభ్యపెట్టే, తప్పుదారి పట్టించే కథనాలు కాదన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయినా హైకోర్టు విభజన పూర్తికాలేదని ఆయన అన్నారు. ఉద్యోగులు, హైకోర్టు విభజనపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని, వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.