అవ్వకు ఆసరా
డోర్నకల్ సెప్టెంబర్ 1 జనం సాక్షి
వృద్ధుల్లో ఆత్మగౌరవాన్ని నింపేందుకు సీఎం కేసీఆర్ ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నారని స్థానిక శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ పేర్కొన్నారు.డోర్నకల్ వ్యాప్తంగా మంజూరైన 1,777 ఆసరా పింఛన్లకు గాను గురువారం పట్టణ కేంద్రం,గొల్లచర్ల కళ్యాణ వేదికలలో 21 గ్రామపంచాయతీలు,మున్సిపాలిటీకి 1,234 ఆసరా పెన్షన్ల కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ వృద్ధులకు ఊతకర్రగా మారి ముందుకు నడిపిస్తుండగా.. దివ్యాంగులు,వితంతువులు, ఒంటరి మహిళల గౌరవాన్ని పెంచుతుందన్నారు.
57 ఏండ్లు దాటిన వారందరికీ ఆసరా పింఛన్లను అందిస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు.నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల లబ్ధిదారుల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే రెడ్యానాయక్.కార్యక్రమంలో ఎంపీపీ బాలు నాయక్,జడ్పిటిసి కమల,మండలాధ్యక్షుడు నున్నా రమణ,మున్సిపల్ చైర్మన్ వీరన్న,వైస్ చైర్మన్ కోటిలింగం,పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్,ఎమ్మార్వో వివేక్,ఎంపీడీవో అపర్ణ,కౌన్సిలర్లు,సర్పంచులు,ఎం పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.