అశ్వారావుపేట వ్యాట్‌పై వస్త్ర దుకాణాలు బంద్
అశ్వారావుపేట: వస్త్ర దుకాణాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేటలో వస్త్ర దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా వస్త్ర దుకాణాల సంఘం ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో ప్రదర్శన నిర్వహించారు. ఆ కార్యక్రమానికి వస్త్ర దుకాణ సంఘం అధ్యక్ష కార్యదర్శులు చంద్రరావు, శ్రీరామమూర్తి నాయకత్వం వహించారు.