అసద్‌కు బెయిల్
– కోర్టులో లొంగుబాటు
హైదరాబాద్,ఫిబ్రవరి 8(జనంసాక్షి):కాంగ్రెస్ నేతలపై దాడి కేసులోపోలీసుల ఎదుట లొంగిపోయిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 2న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సమయంలో విూర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ వద్ద కాంగ్రెస్ నేతలపై దాడి చేసిన కేసులో అసదుద్దీన్ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఎదుట సోమవారం ఆయన లొంగిపోయారు. ఒవైసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అసదుద్దీన్ అభ్యర్థన మేరకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీపై దాడి చేసిన కేసులో మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిందితుడు. అతనిపై ఈ మేరకు కేసు నమోదయ్యింది. సోమవారం ఉదయం సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ కార్యాలయంలో అసదుద్దీన్ లొంగిపోయారు. ఉస్మానియా ఆస్పత్రిలో అసదుద్దీన్‌కు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 2న కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఫిర్యాదు మేరకు అసదుద్దీన్, ఆయన అనుచరులపై విూర్‌చౌక్ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగి తెలిసిందే. సియాసత్ ఉర్దూ
దినపత్రిక విలేకరి ముబాషీర్ పై దాడికి పాల్పడిన ఘటనలో కూడా అసద్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. విూర్ చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ లపై దాడి జరిగింది. ఆ దాడి సమయంలో అసదుద్దీన్ కూడా ప్రత్యక్షంగా ఉన్నారు. ఆయనపై వీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.