అసమర్థ ప్రభుత్వాల వల్ల బెంగాల్‌ అభివృద్ధి కాలేదు-రాహుల్‌

2

కోల్‌కతా, జూన్‌ 6(జనంసాక్షి) : బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ తోపాటు గతంలో పాతికేళ్లపాటు రాజ్యాధికారం చెలాయించిన వామపక్షాలవల్లనే అభివృద్ధికి బెంగాల్‌ ప్రజలు దూరమయ్యారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం కలకత్తాలో జౌళి కార్మికులతో రాహుల్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జౌళి పరిశ్రమలో ఉపాధి కోల్పోతున్న కార్మికులు అండగా ఉంటామని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హావిూ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానని రాహుల్‌ చెప్పారు.

గతంలో వామపక్షాలు ప్రస్తుతం తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిపాలనలో బెంగాల్‌ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలన వస్తేనే బెంగాల్‌లో అభివృద్ధి సాధ్యమని రాహుల్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జౌళి పరిశ్రమలు క్రమక్రమంగా మూతపడుతున్నాయి. ఆ నేపథ్యంలో నిరుద్యోగులుగా మారుతున్న జౌళి కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ వెన్నంటే నిలుస్తుందని రాహుల్‌ హావిూ ఇచ్చారు.