అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టలేరు
` కీలకమైనవాటికి సమ్మతి తెలపకుండా పెండిరగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధం
` స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట
చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో గవర్నర్ వద్ద బిల్లుల పెండిరగ్ అంశంలో డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని అత్యున్నత న్యాయస్థానం వెల్లడిరచింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండిరగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధమంటూ తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్‌ఎన్ రవికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే ఈ పరిణామాల వేళ తాజా తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.‘’10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలన్న గవర్నర్ చర్య చట్టవిరుద్ధం, ఏకపక్షం. గవర్నర్ బిల్లును పునఃపరిశీలనకు వెనక్కి పంపాక.. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన తర్వాత రెండోసారి ఆ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి సిఫార్సు చేయకూడదు. అలా చేస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లుగానే పరిగణించాలి. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించదలిస్తే నెలరోజుల్లోపే గవర్నర్ దానిపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదనకుంటే 3 నెలల్లోపు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ శాశ్వతంగా వాటిని తమ వద్ద ఉంచుకోలేరు’’ అని సుప్రీం ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును పాస్ చేసి ఆమోదం కోసం పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లుకు ఆమోదముద్ర వేయడం, సమ్మతిని నిలుపుదల చేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం, పునఃపరిశీలనకు మళ్లీ శాసనసభకు పంపడం వంటివి చేస్తారు. తర్వాత మళ్లీ సభ దానిని ఆమోదిస్తే.. గవర్నర్ సమ్మతితో నిలిపివేయలేరు. కానీ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. రాజ్యాంగానికి, ప్రభుత్వ విధానాలకు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు విరుద్ధంగా ఉందని భావిస్తే.. ఆవిధంగా రిజర్వ్ చేసే వీలు ఉంటుంది.శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచేసుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లుల్ని సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలో ఆయన తీరు మారడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై తాజాగా సుప్రీం తీర్పు వెలువరించింది. ‘’తమిళనాడుతో పాటు రాష్ట్రాలన్నింటికి ఇది భారీ విజయం’’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తంచేశారు.