అసోంలో ఉగ్రదాడి
– 12 మంది మృతి
అసోం,ఆగస్టు 5(జనంసాక్షి):అసొంలో ఉగ్రపంజా పడింది. కోక్రాఝార్‌లో ఉగ్రదాడి జరిగింది. కోక్రాఝార్‌లో జరుగుతున్న వారాంతపు సంతలో అనుమానిత ఉగ్రవాది గ్రనేడ్ విసిరినట్లు ప్రత్యక్ష సాక్షి ద్వారా తెలుస్తోంది. దాడి అనంతరం కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. ఉగ్రవాది కాల్పుల్లో మొత్తం 13 మంది మృతి చెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారారులు వివరించారు. క్షతగాత్రు లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, అధికారులు పూర్తి సహాయక చర్యలు చేస్తున్నారు. సం ఘట నాస్థలానికి చేరుకున్న కేంద్ర, రాష్ట్ర భద్రతాబలగాలు ఉగ్రవాదిని మట్టుబెట్టినప్పటికీ మరో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.




