అసోం పర్యటనలో ఎలాంటి దాడీ జరగలేదు

ట్విట్టర్‌లో వెల్లడించిన బాలీవుడ్‌ సింగర్‌ షాన్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): బాలీవుడ్‌ సింగర్‌ షాన్‌ గౌహతిలో చేసిన కాన్సర్ట్‌ రచ్చ రచ్చగా మారిందని, అతనిపై రాళ్లు, పేపర్‌ బాల్స్‌ విసిరారని వచ్చిన వార్తలను అతను స్వయంగా ఖండించాడు. మంగళవారం ట్విటర్‌ ద్వారా అతను తన వాదన వినిపించాడు. కాన్సర్ట్‌లో ఏవిూ జరగలేదని, కేవలం ఓ వ్యక్తి మాత్రమే ఓ పేపర్‌ టికెట్‌ను స్టేజ్‌పైకి విసిరాడని షాన్‌ ట్వీట్‌ చేశాడు. విూడియావన్నీ అబద్దాలు.. ఓ అభిమాని పాడటం ఆపంటూ ఓ పేపర్‌ టికెట్‌ను విసిరాడు.. అంతే అని షాన్‌ స్పష్టంచేశాడు. ఈ నెల 28న గౌహతిలోని సారుసజాయ్‌ స్టేడియంలో షాన్‌ కాన్సర్ట్‌ జరిగింది. అయితే ఇది తాను అనుకున్నట్లుగా మాత్రం జరగకపోవడంపై అతను అసంతృప్తి వ్యక్తంచేశాడు. అస్సాం టూర్‌లో భాగానే ఎంజాయ్‌ చేశానని, అదొక్క దురదృష్టకర ఘటన వల్ల తాను రాష్ట్రాన్ని నిందించాలని అనుకోవడం లేదని పర్యటన ముగిసిన తర్వాత అతను ట్వీట్‌ చేశాడు. షాన్‌ షో బాగానే మొదలైనా.. అతడు బెంగాలీ పాటలు పాడటం మొదలుపెట్టగానే కొందరు అభిమానులు స్టేజ్‌పైకి ఏవో వస్తువులు విసిరారు. దీనిని ఉద్దేశించి అప్పుడే షాన్‌ మాట్లాడుతూ.. విూరు ఎవరైనా సరే కళాకారులపైకి ఇలాంటి వస్తువులు విసరడం సరి కాదన్నది గుర్తుంచుకోండి అని అన్నాడు. ఆ వెంటనే తన షోను ఆపేశాడు. హైఫీవర్‌ ఉన్నా సరే పాడటానికి వచ్చానని, ఇలాంటి వ్యక్తులు ఉన్న చోటు తాను పాడలేనంటూ వెళ్లిపోయాడు. షాన్‌ ఇప్పటివరకు తమిళ్‌, తెలుగు, హిందీ, మరాఠీ, ఇంగ్లిష్‌ భాషల్లో వందకుపైగా పాటలు పాడాడు.