తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు


తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయినా విజయ డైరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది,తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల్లో ఆందోళన మొదలైంది. దేవాలయాల్లో లడ్డూ అంటేనే భక్తులు భయపడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో అన్ని దేవాల యాల్లో విజయ డెయిరీ నెయ్యినే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా కరీంగనర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యిని చేరవేసింది.విజయ నెయ్యితోనే లడ్డూ ప్రసాదం తయారు చేసి భక్తులకు ప్రసాదంగా అందించే పనిలో అధికార యంత్రంగం నిమగ్నమై ఉంది.ఉమ్మడి జిల్లాల్లోని ప్రముఖ ఆలయాల్లో లడ్డూ, పులిహోర ప్రసాదాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావించి కొనుగోలు చేస్తుంటారు.తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో తప్పిదం జరిగిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ అలర్ట్ అయ్యింది. ప్రధాన ఆల యాల్లో తాజా ఉత్తర్వులను తప్పకుండా పాటించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యిని మాత్రమే వాడాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకాలం వాడిన కరీంనగర్ డెయిరీ నెయ్యిని బంద్ చేసి విజయ డెయిరీ నెయ్యి కంటే కిలో 12రూపాయలు విజయ డెయిరీ నెయ్యి తక్కువకు లభిస్తుండటంతో ప్రభుత్వం నిర్ణయం ఆలయాలకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు…