అస్వస్థతకు గురైన మాజీ సిఎం
డెహ్రాడూన్,అక్టోబర్7(జనం సాక్షి): ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత హరీష్ రావత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని సోమవారం ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఉదయాన్నే నిద్ర లేచిన ఆయనకు స్పృహ తప్పడంతో హుటాహుటిన డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. భయపడాల్సింది ఏవిూ లేదని, వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించామని.. తొందర్లోనే డిశ్చార్జ్ చేస్తారని అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు.