అహింసా మార్గంలోనే తెలంగాణ ఉద్యమం

– మార్చ్‌పై రాజ్య హింసకు నిరసనగా కోదండరాం మౌనదీక్ష
– భాగస్వామ్య పక్షాలు పరస్పర విమర్శలు వద్దు
– కేసీఆర్‌పై విమలక్క వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : కోదండరాం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుతంగానే ఉద్యమం కొనసాగిస్తామని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. బాపూ జయంతి సందర్భంగా కోదండరాం, పలువురు జేఏసీ నేతలు బాపూఘాట్‌ వద్ద గాంధీజీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడే మౌనదీక్షను ప్రారంభించారు. తెలంగాణ కవాతు సమయంలో తెలంగాణవాదులపై పోలీసులు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ, తెలంగాణ రాష్టాన్న్రి ఆకాంక్షిస్తూ దీక్షను చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయన నోటికి నల్లగుడ్డ కట్టుకొని దీక్షలో పాల్గొన్నారు. ఈ సమయంలో విూడియా అడిగిన ప్రశ్నలకు కోదండరామ్‌ తాను మౌనదీక్షలో ఉన్నానని చెబుతూ గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో కొద్దిగా మాట్లాడారు. తాము శాంతియుతంగా ఉద్యమిస్తామన్నారు. సామాజిక ఉద్యమాలలో పోలీసులు హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. హింసా మార్గం మంచిది కాదన్నారు. ప్రభుత్వం కూడా జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన అహింస దిశలో తమకు సహకరిస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు.సంపన్న వర్గాల కోసం తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ పెద్దలు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ప్రకటన శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కొందరి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. తెలంగాణ సాధన కోసం గల్లీలో పోరాటాలు చేస్తూనే ఢిల్లీలో రాజకీయ చర్చలు జరపాల్సిందేనని కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ ప్రజలకు మంత్రి జానాను రాజీనామా కోరే హక్కు ఉందని ఆయన చెప్పారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానా రెడ్డి రాజీనామా కోరే హక్కు ప్రతి ఉద్యమకారుడికి ఉందని తెలంగాణ జెఏసి నేతలు విఠల్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలను వారు ఖండించారు. జెఏసి జానా ఇంట్లోనే ప్రారంభమైనప్పటికీ… ఆయన ఇప్పుడు జెఏసిలోకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రుల రాజీనామా కోరే హక్కు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి ఉందన్నారు.తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులే నష్టపోయారన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం పదవులు తెచ్చుకొని లాభపడ్డారని ఆరోపించారు. జెఏసి జానా ఇంట్లో పుట్టినంత మాత్రాన ఆయన చెప్పినట్లు-గా నడుచుకోవాలనే నియమం ఏవిూ లేదన్నారు. తెలంగాణ మార్చ్‌లో దౌర్జన్యానికి తెలంగాణవాదులు కారణం కాదని స్వామి గౌడ్‌ పేర్కొన్నారు.