ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు

 

 

 

 

 

నవంబర్ 11(జనంసాక్షి):హైదరాబాద్‌: ప్రకృతి కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు లాలాపేటలోని అందెశ్రీ నివాసం నుంచి తార్నాక, ఉప్పల్‌ మీదుగా ఘట్‌కేసర్‌ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అంతమయాత్రలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మాజీ ఎంపీలు వీ.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, అరుణోదయ సాంస్కృతిక సమాక్య విమలక్క పాల్గొన్నారు. అందెశ్రీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.