ఆందోళనకు ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ మద్దతు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటన బాధాకరమని ఆర్మీ మాజీ చీఫ్ వికే సింగ్ అన్నారు. ఈ ఉదయం ఆయన ఇండియా గేట్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగిన విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా దేశంలో లా అండ్ ఆర్డర్‌ను కఠినతరం చేయాలని కోరారు. పోలీసు చట్టాల్లో సంస్కరణలు చేపట్టాలని సూచించారు.