ఆంధ్రాకు సాయం చేస్తాం
– అరుణ్ జైట్లీ
– ప్రధానితో బాబు భేటి
న్యూఢిల్లీ, ఆగస్ట్25(జనంసాక్షి):
ఏపీకి ప్రత్యేక¬దా, ప్రత్యేక ప్యాకేజీపై ఇచ్చిన హావిూలను అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు విభజన చట్టంలో ఉన్న హావిూలను అమలు చేయాలని కోరారు. ఢిల్లీకి వచ్చిన బాబు మంగళవారం ఉదయం ప్రధానితో సమావేశమయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. పెండింగ్‌లో ఉన్న విభజన హావిూలను నెరవేర్చాలని బాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టులపైనా సిఎం చర్చించారు. ఎపీ ఆర్థికంగా నిలదొక్కకునేంత వరకూ సాయం చేయాలని ప్రధానిని చంద్రబాబు కోరినట్లు సమాచారం. ప్రధానితో భేటీ అనతరం చంద్రబాబుతో కలిసి అరుణ్‌జైట్లీ విూడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని అన్ని హావిూలు నెరవేరుస్తామని ప్రధాని చెప్పారని అరుణ్‌జైట్లీ వెల్లడించారు. విభజన చట్టంలోని హావిూలపై రోడ్ మ్యాప్ తయారు చేయాలని నీతి ఆయోగ్‌ను ప్రధాని ఆదేశించారని చెప్పారు. నీతిఆయోగ్ అధికారులు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చిస్తున్నారన్నారు. నీతి ఆయోగ్ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తారని, రోడ్ మ్యాప్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విభజన చట్టంలోని స్పష్టంగా ఉన్న హావిూల అమలుపై ప్రధాని వద్ద చర్చించామని అరుణ్ జైట్లి చెప్పారు. చాలా వివరంగా సమావేశంలో చర్చించడం జరిగిందని అన్నారు. దీనిపై నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు పనగారియా కు దీనిపై రోడ్ మాప్ తయారు చేయాలని ప్రధాని మోడీ ఆదేశించారని ఆయన తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ తొంభై మూడు,తొంభై నాలుగులోని అంశాలపై చర్చ జరిగిందని అన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హావిూలను అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రధాని ఉన్నారని అన్నారు. ప్రత్యేకించి విభజన చట్టం హావిూల గురించి అరుణ్ జైట్లి ప్రస్తావించారు. ఇకపోతే పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రత్యేక ¬దాకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసకుంటున్నామన్నారు. దీనిపై ప్రధానితో భేటీలో విస్తృతంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. ప్రత్యేక ¬దా, ప్యాకేజీ, కేంద్రం సాయం, పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు సాయం చేయాలని ప్రధానిని కోరారు. విభజన చట్టంలోని మూడు కీలక సెక్షన్లపై చర్చ జరిగిందని, ఏపీకి న్యాయం చేకూర్చే సెక్షన్లపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. సెక్షన్ 90 విషయంలో రోడ్‌మ్యాప్ రూపొందించాలని నితి ఆయోగ్‌ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 46, 90, 94లో ఏపీకి సంబంధించిన అంశాలున్నాయని, విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని అరుణ్‌జైట్లి వివరించారు. ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ తదితరులు కూడా భేటీలో పాల్గొన్నారు. అంతకుముందు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్టాల్రకు ఇచ్చిన హావిూలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాజ్‌నాథ్ హావిూ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక ¬దాపై కొన్ని సమస్యలు ఉన్నాయని, హావిూల అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇవి కేవలం ఆరునెలలు, సంవత్సరానికి జరిగే విషయాలు కావని , ప్రజలు గమనించాలన్నారు. అయితే ప్రత్యేక ¬దాను రాజకీయం చేయడం తగదని వెంకయ్య అన్నారు. విభజన చట్టం అమలయ్యేలా చూడాలని ¬ంమంత్రిని కోరామని వెంకయ్య తెలిపారు.
ప్రత్యేక ¬దా, ఆర్థిక సాయం విషయంలో ఇతర రాష్టాల్రతో ఆంధ్రప్రదేశ్‌ను పోల్చలేమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పస్టం చేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి చేయాల్సింది చేస్తామని, విభజన చట్టంలోని హావిూలను ఆంధ్రప్రదేశ్‌కు అమలు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారని జైట్లీ వెల్లడించారు. మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన విూడియా సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోని హావిూల అమలుకు రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేయాలని నీతి ఆయోగ్‌ను ఆదేశించినట్లు జైట్లీ వెల్లడించారు. గత ఏడాది రెవెన్యూలోటు భర్తీకి ప్రయత్నించామని, ఏపీలో ఏడు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఆర్థిక సాయం చేసిందని అన్నారు. తొలి ఏడాది కొంత ఆర్థిక సాయం చేశామని చెప్పారు. ఏపీలో జాతీయస్థాయి సంస్థలకు ఇప్పటికే శంకుస్థాపనలు చేశామని, విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
విభజన చట్టంలో లేకపోయినా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హావిూ ఒకటి ఉందని.. దానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని, ఏదో ఒక రూపంలో ప్రయోజనాలను అందజేస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ¬దాను పరోక్షంగా ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక ¬దా పేరు లేకున్నా ఆ ప్రయోజనాలన్నీ అందజేస్తామని ఆయన చెప్పారు. నీతి అయోగ్ సిఫార్సుల మేరకే ఏపీకి ఆర్థిక సాయంపై తుది నిర్ణయం తీసుకుంటామని అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. ఏపీ సమస్యలన్నీ మాకు తెలుసునని, ఏపీకి చేయాల్సినదంతా చేస్తామని, ప్రత్యేక ¬దాలో ఉన్న ప్రయోజనాలన్నీ అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించడానికి ప్రయత్నిస్తామని ఆయన హావిూ ఇచ్చారు. ఏపీని ఇతర రాష్టాల్రతో పోల్చలేమని, బీహార్ వేరు.. ఏపీ వేరు అని ఆయన అన్నారు. పారిశ్రామికాభివృద్ధి కోసం మినహాయింపులు ఇవ్వమని ఏపీ అడిగిందని, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఇప్పటికే కొన్ని నిధులు ఇచ్చామని ఆయన తెలిపారు. విజయదశమి రోజున రాజధాని నిర్మాణం ప్రారంభిస్తామని అన్నారు. దానికి సంబంధించిన ఖర్చులపై ఒక నివేదిక తయారు చేయాలని నీతి అయోగ్‌ను ప్రధాని మోదీ ఆదేశించారని జైట్లీ తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటామని, అప్పటి ప్రధాని చెప్పిన దానికి, సిఫారసులకు చాలా తేడా ఉందని
ఆయన అన్నారు. ప్రత్యేక ¬దా అన్నా, ప్రత్యేక సాయం అన్నా సారాంశంలో అది డబ్బే అని, అది ఏదో ఒక రూపంలో అందజేస్తామని అరుణ్‌జైట్లీ అన్నారు. ఎంత ఇచ్చేది త్వరలో నిర్ణయిస్తామని, విూరు ఊహించిన దానికంటే ఎక్కువే ఇస్తామని విూడియా ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఆర్థిక ప్రయోజనాలు పందడం ఏపీ హక్కని, రాయ్‌పూర్, అహ్మదాబాద్‌లాగే ఏపీ అభివృద్ధి చెందుతుందని జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు.
అవమానాలను ప్రధానికి వివరించా: బాబు
హైదరాబాద్ లో అడుగడుగునా అవమానాలు ఎదుర్కున్నామని ,పెత్తందారితనం చూశామని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ పదేళ్ల తరవాతనే తెలంగాణ రాజధాని అవుతుందని, అంతవరకు అది ఉమ్మడి రాజధాని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా పదేళ్లు ఉంటుందని చట్టంలో ఉందని, సెక్షన్ ఎనిమిది లో స్పష్టంగా ఉందని అన్నారు.ప్రత్యేక ¬దా అన్నటికి సంజీవిని కాదని ఆయన అన్నారు. ప్రధానికి సెంటిమెంటును వివరించానని , హైదరాబాద్ లో ఎదుర్కున్న సమస్యలు వివరించానని అన్నారు. ఆఫీసర్లను కూడా ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు. విజయవాడ వెళితే సి.ఎం. గా పనిచేయడానికి చాంబర్ లేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను బస్ లో ఉంటున్నానని ఆయన అన్నారు. ఉద్యోగులు కూడా తమ పిల్లల సంగతి ఏమిటని అడుగుతున్నారని అన్నారు. అమరావతిలో వారికి అకామడేషన్ ఇవ్వాల్సి ఉందని అన్నారు. ప్రధాని తనకు గంట ముప్పైఐదు నిమిషాలు సమయం ఇచ్చారని , అన్ని విషయాలు తెలుసుకున్నారని అన్నారు. ముందుగానే ఏవో ఊహించుకోవద్దని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే సరిపోదని, దానితో పాటు ప్యాకేజీలు ఇస్తేనే ఎపికి మేలు జరుగుతుందని చంద్రబాబు అన్నారు.
కేవలం ¬దా సరిపోదు
కేవలం ¬దా మాత్రమే ఇస్తే సరిపోదని, అది ఇచ్చాం అంటే కూడా ఉపయోగం ఉండదని అన్నారు. గత ఏడాది కేంద్రం ఆర్దిక సాయం చేసిందని, దానికి కృతజ్ఞతలు తెలియచేశామని అన్నారు. పోలవరంపై కాంగ్రెస్ కు మాట్లాడే హక్కు లేదని, ఎన్.డి.ఎ. వచ్చాక ముంపు మండలాలను ఎపిలోకి తీసుకు వచ్చామని అన్నారు. విభజన చట్టంలోని వివిధ హావిూలను వివరించామని అన్నారు.రైల్వే జోన్, దుగరాజపట్నం ఓడరేవు, కడప ఐరన్ పరిశ్రమ, విజయవాడ, విశాఖ లలో మెట్రో రైల్ నిర్మాణం మొదలైనవాటిని అమలు చేయాలని కోరామని అన్నారు. పదో షెడ్యూల్ లోని సంస్థల విబజన ఏమైందని, గత కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని,ఇప్పుడు ప్రభుత్వం చేయవలసి ఉందని అన్నారు. ఎపి, తెలంగాణ రాష్టాల్ర మధ్య విభేదాలు ప్రజలు పెట్టుకున్నవి కావని, నాయకులు పెడుతున్నవని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నోసార్లు తాను కలిసి మాట్లాడుకోవాలని చెప్పానని ,అయినా వినలేదని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొందరు ప్రయత్నించారని అన్నారు. రాజదాని అంటే కేవలం పరిపాలన భవనాలు మాత్రమే కాదని, ప్రత్యేక ¬దా అంటే కేవలం రెండు ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. ప్రత్యేక ¬దా ఇవ్వలేమని అంటున్నారని,దానికి తగ్గ డబ్బులు ఇస్తామని చెబుతున్నారని ఆయన అన్నారు. రాష్టాన్రికి ఏమి ఇస్తారో చెప్పాలో తెలియచేయాలని కోరుతున్నానని అన్నారు. అయితే తాను ప్రత్యేక ¬దానే కోరుతున్నామని అన్నారు.తాను విష్ లిస్టు పెట్టదలచలేదని, న్యాయపరంగా రావల్సినవి ఇవ్వాలని కోరామని అన్నారు. ప్రధాని ఎలా స్పందించారని అడిగితే విబజన చట్టంలోనివి స్పష్టంగా అమలు చేయాలని అన్నారని బాబు చెప్పారు. ఇతర రాష్టాల్రతో
సమానంగా అబివృద్ది చెందేవరకు ఎపికి సాయం చేయాలన్నదే తన డిమాండ్ అని చంద్రబాబు అన్నారు. ఎపి విభజనను తాము కోరుకోలేదని , విభజన తీరు కూడా సరిగా జరగలేదని అన్నారు. తాను గతం నుంచి ఈ విషయం చెబుతున్నానని అన్నారు .చత్తీస్ గడ్ విభజనను కోరుకున్నాయని అన్నారు. ప్రత్యేక ¬దా విషయంలో ఎలా చేయాలా అన్నది ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు. మంచి రాజదాని నిర్మిస్తామని ఎన్నికల సమయంలో మోడీ కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు.కేవలం ప్రత్యేక ¬దాతో నే కాదని, ఇతర ప్యాకేజీలు కూడా అవసరమని ఆయన అన్నారు. విూరు ఏమి చేస్తారో చెప్పాలని అడిగానని, దానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేసుకుంటామని తెలిపామని అన్నారు. విభజన చట్టంలో ఉన్న వాటిపై ఇప్పటికే కేంద్రం కొంత ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. ఆర్థికలోటు కింద రూ.2,300 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు కేంద్ర మంజూరు చేసినట్లు తెలిపారు. బుదేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీని ఏడు జిల్లాలకు ఇస్తామని అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూ విషయాన్ని మోదీకి గుర్తు చేసినట్లు చంద్రబాబు తెలిపారు.